ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. సమంతతో అంత ఈజీ కాదు!

సమంత వ్యవహారం అంత ఈజీ కాదు. ఓ బేబీ సినిమాలో డైలాగ్‌లా.. నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనే మాట సమంతకు ఎంత యాప్ట్ అవుతుందో.. నాపై ట్రోలింగ్ చేస్తే వ్యవహారం మామూలుగా ఉండదు అనే డైలాగ్ కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే సమంతపై ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. దానికి సమంత ఇచ్చే ఘాటు రిప్లైలను ఇక్కడ రాయడానికి కూడా వీలు ఉండదు.

Samantha Akkineni Strong Reply To Trolling About Preetham
Samantha Akkineni strong reply To Trolling ABout Preetham

అంత పరుషంగా రిప్లై ఇస్తుంది సమంత. తనపై విరుచుకుపడే నెటిజన్లు, సూక్తులు, ప్రవచనాలు చెప్పేవారిపై సమంత ఓ రేంజ్‌లో కౌంటర్ వేస్తుంది. ఆ మధ్య బికినీ ధరించడంపై సమంతను నెటిజన్లు టార్గెట్ చేస్తూ అసభ్య సంజ్ఞతో గట్టిగా సమాధానం ఇచ్చింది. దాంతో అందరూ నోరు మూసుకున్నారు. తాజాగా మరోసారి సమంత మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్‌తో కాస్త చనువుగా ఉన్న ఫోటోను సమంత షేర్ చేసింది.

ఐలవ్యూలు చెప్పుకోవడం, అలా ఓ సోఫాలో కూర్చుని అతని ఒడిలో సమంత కాలేసుని కూర్చోవడంతో సమంతను ఏకిపారేశారు. అక్కినేని పరువుతీస్తున్నావంటూ దారుణంగా తిట్టిపోశారు. దీనిపై సమంత కాస్త సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు చురకలు అంటించింది. అందులో ఓ కుక్క.. సింహం, పులితో పోటీ పడుతోంది. నువ్ ఎంత పెద్ద దానివైనా సరే నా ముందు మాత్రం నువ్వో పిల్లివి అంటూ కుక్క ముందుకు వెళ్తున్నట్టు చూపించింది. అంటే మీరు ఎంతలా ట్రోల్ చేసినా మీ స్థాయి నా ముందు అదే అన్నట్టుగా కౌంటర్ వేసినట్టుంది. మొత్తానికి సమంత ఇది ఏ ఉద్దేశ్యంతో పెట్టిందో కానీ పరిస్థితికి మాత్రం సింక్ అవుతోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles