కళ్లతోనే మత్తెక్కిస్తోంది.. సమంత హాట్ లుక్స్ వైరల్

Samantha Akkineni enjoys Goa in 2021 New year celebration

సమంత ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా సమంత గోవాకు చెక్కేసింది. భర్తతో కలిసి సమంత గోవాలో రచ్చ చేసేందుకు బయల్దేరింది. తన స్నేహితురాల్లతో కలిసి సమంత గోవాలో ఆల్రెడీ సెలెబ్రేషన్స్ మొదలెట్టేసింది. శిల్పా రెడ్డితో కలిసి గోవాలో రచ్చ చేస్తోంది. గతంలో కలిసి వెళ్లిన ఫోటోలు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను పోల్చుతూ పోస్ట్ చేసింది. అప్పటికీ ఇప్పటికీ నాగ చైతన్య ఏ మాత్రం మారలేదని చెప్పుకొచ్చింది.

Samantha Akkineni enjoys Goa in 2021 New year celebration
Samantha Akkineni enjoys Goa in 2021 New year celebration

ఇక సమంత ఈ మధ్య తన ఫోటోలతోనే రచ్చ చేస్తోంది. హాట్ హాట్ డ్రెస్సులతో వైరల్ అవుతోంది. ప్రకటనల్లో భాగంగా సమంత ధరించే దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి సైతం సమంతను బాగానే టార్గెట్ చేస్తోంది. సమంత దుస్తులు, ఎక్స్‌పోజింగ్‌పై దారుణమైన కామెంట్లు చేస్తోంది శ్రీ రెడ్డి. కానీ సమంత మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదనిపిస్తోంది.

తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. కళ్లలోన ఏదో గమ్మత్తు ఉన్నాదే అనే పాట పాడుకోవాల్సి వస్తుంది. సమంత తన కళ్లతోనే మాయచేసేలా ఉంది. మత్తెక్కించేలా చూస్తున్న సమంత ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. సమంత ఇక కొత్త ఏడాది ప్రారంభంలో గోవాలోనే సందడి చేసి తీరిగ్గా హైద్రాబాద్‌కు వచ్చేలా కనిపిస్తోంది. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కూడా జనవరిలోనే వచ్చేలా ఉంది.