ఆగలేకపోతోన్నారా?.. సమంత పోస్ట్ వైరల్

సమంత ఇప్పుడు సినిమాలతో కంటే యాడ్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఎంచక్కా ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. దాదాపు సినిమాకు వచ్చే రెమ్యూనరేషన్ కాస్త అటూ ఇటూగా వస్తుంటుంది. యాడ్స్‌లో అయితే ఎలాంటి నియమ, నిబంధనలుండవు. అందుకే సమంత ఎక్కువగా ప్రకటనల్లోనటించేందుకు మొగ్గు చూపుతున్నట్టుంది. లాక్డౌన్‌లోనూ సమంత యాడ్స్‌తో దుమ్ములేపింది.

Samantha Akkineni About Realme X7
Samantha Akkineni about Realme X7

నిన్నటికి నిన్న ఓ పరుపుకు సంబంధించిన ప్రకటనలో నటించింది. స్లీప్ వెల్ మ్యాట్రిసెస్ అంటూ ఓ యాడ్ వీడియోను షేర్ చేసింది. లాక్డౌన్, కరోనా వల్ల ఎంతో మార్పులు వచ్చాయి.. మనం పడుకునే ప్లేస్ ఎంతో సురక్షితంగా ఉండాలి.. అందుకే నేను స్లీప్ వెల్‌కు మారిపోయాను.. ఇందులో వేపతో కూడిన సుగుణాలున్నాయంటూ ఏదేదో చెప్పింది. మొత్తానికి సమంత చేసిన యాడ్ కాబట్టి బాగానే వైరల్ అయింది.

తాజాగా సమంత మరో యాడ్‌లో నటించింది. కొత్తగా రిలీజ్ కాబోతోన్న ఫోన్‌కు సంబంధించిన యాడ్‌లో నటించింది. రియల్ మీ x7 సిరీస్ ఫోన్ లాంచ్ కాబోతోందని.. భవిష్యత్తును అనుభవించడాని ఆగలేకపోతున్నారా? అంటూ ఫోన్ గురించి కామెంట్ చేసింది. మొదటి సేల్ ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుందని తెలిపింది. ఇందులో సమంత వేసుకున్న డ్రెస్, నడుము అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles