ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన చిత్రాల్లో స్టార్ హీరోల సినిమాలు మినహాయిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యి భారీ రెవెన్యూస్ ఇచ్చిన సినిమాల్లో మాత్రం చాలా చిన్న చిత్రాలు అలాగే మిడ్ రేంజ్ హీరోల సినిమాలే ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి. మరి అలా చిన్న బజ్ తో రిలీజ్ అయ్యిన ఓ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర క్రేజీ రన్ తో అయితే దూసుకెళ్తుంది.
ఆ సినిమానే “సామజవరగమన”. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా రిలీజ్ టైం లో శ్రీవిష్ణు కన్నా ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ చిత్రం “స్పై” తో రిలీజ్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఆ సినిమా రన్ ని వెనక్కి నెట్టేసి తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా “సామజవరగమన” హవానే కనిపిస్తుండడం విశేషంగా మారింది. ఇక స్పై సినిమా రన్ ఆల్రెడీ ఆగిపోగా గత వారంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ చిన్న చిత్రానికి అడ్డు లేకుండా పోయింది.
ఇక ఈ సినిమా అయితే ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో 9 లక్షల డాలర్స్ కి దగ్గర అయ్యి 1 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకెళ్తుండగా వరల్డ్ వైడ్ గా అయితే ఈ చిత్రం ఇపుడు 40.21 కోట్ల గ్రాస్ ని జస్ట్ ఈ 12 రోజుల్లో అందుకుంది. అయితే ట్రేడ్ టాక్ ప్రకారం అయితే..
ఇప్పుడు ఈ చిత్రానికి వీక్ డేస్ లో కూడా మినిమమ్ 50 లక్షల షేర్ తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుందట. దీనితో “సామజవరగమన” ఏ స్థాయి ఆదరణ అందుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇప్పుడు శ్రీవిష్ణు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి మరిన్ని వసూళ్లు దిశగా సాగుతుంది.
From audience adoration to box office domination💥#Samajavaragamana showing its supremacy all over ❤️
Grosses 40.21 CR in 12 days WW🔥&
Heading towards Blockbuster 3rd Week🤩– https://t.co/zAJRd5c8Nf@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AKentsOfficial @HasyaMovies… pic.twitter.com/k3Fi58WtvH
— Shreyas Media (@shreyasgroup) July 11, 2023