శ్రీవిష్ణు.. ఇక దంచుకోవడమే..

ఇప్పుడందరు ఫ్యామిలీ ఆడియెన్స్​, యూత్ ఆడియెన్స్​ నుంచి ఒకటే మాట.. ఏం సినిమాకు వెళ్దాం అంటే.. అందరి నోట ఒక్కటే మాట.. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న’. వారం రోజులగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురిపిస్తోంది. అసలే చిన్న సినిమాల‌కు ప్రేక్ష‌కులు రావడం చాలా కష్టమైన రోజుల్లో.. ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించి రప్పించేస్తోంది. స్థాయికి మించిన వ‌సూళ్లను అందుకుంటోందని తెలుస్తోంది.

ఈ చిత్రం వారం తిరిగేస‌రికి 30 కోట్ల గ్రాస్, దాదాపు రూ. 20 కోట్ల షేర్ అందుకుందని సమాచారం అందింది. అంటే ఇది చిన్న విష‌యం కాదనే చెప్పాలి. ఈ చిత్ర మౌత్​ టాక్‌ పాజిటివ్​గా ఉండడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మిగతా చిత్రాలకు ప‌రిస్థితులు కలిసిరాకపోవడం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. గ‌త వారం ఈ చిత్రానికి పోటీగా విడుదలైన సినిమాలేవీ నిలబడలేదు.

ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజైన నిఖిల్ ‘స్పై’ నెగటివ్ టాక్​తో చతికిలపడింది. దీంతో ఈ అడ్వాంటేజ్‌ను సామజవరగమన బాగా ఉప‌యోగించుకుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి రెండో వారంలోనూ బాగా క‌లిసొచ్చినట్టు కనిపిస్తోంది. వీక్ డేస్‌లో కాస్త స్లో అయిన ఈ చిత్రం.. వీకెండ్ వచ్చేసరికి శుక్ర‌వారం సాయంత్రం నుంచి మ‌ళ్లీ బ‌లంగా పుంజుకుందట.

నిజం చెప్పాలంటే శుక్ర‌వారం మీడియం బడ్జెట్​ సినిమాలు చాలానే రిలీజ‌య్యాయి. అవన్నీ ఫస్ట్ షో నుంచే ఆశించిన స్థాయిలో మంచి టాక్ తెచ్చుకోలేక‌పోయాయి. నాగ‌శౌర్య ‘రంగ‌బ‌లి’కి మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. ఇది ఏ మాత్రం ముందుకు సాగుతుంతో తెలీదు. ఇక శ్రీ సింహా ‘భాగ్​ సాలే’ నెగటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఇది పూర్తిగా వాషౌట్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక జ‌గ‌ప‌తిబాబు పీరియాడిక్ ఫిల్మ్​ రుద్రంగికి కూడా ఆశించిన స్థాయిలో టాక్​ను అందుకోలేదు. అలా భాగ్ సాలే, రుద్రంగి చిత్రాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. చాలా చోట్ల ఆడియెన్స్ లేక షోలు క్యాన్సిల్ అయ్యే ప‌రిస్థితి కూడా కనిపిస్తోంది. 7:11 పీఎం, స‌ర్కిల్ వంటి సినిమాలను కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ఈ వారం కూడా అందరీ దృష్టి సామాజవరగమన మీదే ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇదే లీడ్ రోల్ పోషించనుంది. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు ఈ రెండో వారం కూడా మంచి వసూళ్లనే అందుకునే ఛాన్స్​లు కనపడుతున్నాయి.