Samantha: రూటూ మార్చిన సమంత… హాలిడే వెకేషన్ కోసం థాయిలాండ్ వెళ్లిన సామ్… ఫోటోలు వైరల్!

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈమె నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే యశోద సినిమా షూటింగ్ తో సమంత ఎంతో బిజీగా ఉన్నారు.తన భర్త నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. సమంత మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత సమంత ఎంతో బిజీకానున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సమంత చిన్న వెకేషన్ ప్లాన్ చేశారు. సాధారణంగా సమంత తన వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్తారు. అయితే ఈసారి రూట్ మార్చి థాయిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది.థాయిలాండ్ లో తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.