అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలి ప్రమోషన్‌ను అందుకున్న సమంత వారి పేరు నిలబెడుతుంది. చేసిన ప్రతి పనిలో సక్సెస్ సాధిస్తూ అక్కినేని ఫ్యామిలీకి తగ్గ కోడలు అనిపించుకుంటుంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఓ రేంజ్‌కు వెళ్ళిన సమంత వెబ్ సిరీస్‌లు, సోషల్ సర్వీస్‌లు , సేంద్రీయ వ్యవసాయాలు, ఫుడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలతో అందరి మనసులకి చాలా దగ్గరవుతుంది.
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం ఇటీవల మనాలీకి వెళ్లగా, బిగ్ బాస్ షోని హోస్ట్ చేసే బాధ్యతలను సామ్ తీసుకుంది. సమంత బిగ్ బాస్ షోని మూడు గంటల పాటు హోస్ట్ చేస్తుందని ప్రోమోలు విడుదల కావడంతో అందరు షాక్ ఇయ్యారు. హోస్టింగ్ అనుభవం లేదు, తెలుగుపై పట్టు లేదు. అలాంటిది ఇంత పెద్ద షోని ఎలా హ్యాండిల్ చేస్తుందని అంతా ఆలోచనలో పడ్డారు. కాని అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.
హౌజ్‌మేట్స్‌తో పంచ్‌లు, వాళ్ల సీక్రెట్స్ బట్ట బయలు చేయడం, కరెక్ట్ టైమింగ్‌లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో స్పందించడం ఇలా అన్ని విషయాలలో సమంత వంద శాతం సక్సెస్ అయింది. నవ్వుతోనే సగం దసరా మెగా ఎపిసోడ్‌ను బంపర్ హిట్ చేసిన సమంత తాజాగా తన ఎక్స్‌పీరియెన్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి హోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మామయ్య నాకు బాధ్యతను అప్పగించడం వలన వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యాంకరింగ్ చేసిన అనుభవం లేదు. తెలుగు సరిగా మాట్లాడతానో లేదో అనే భయం ఉండేంది.
బిగ్ బాస్ ఎపిసోడ్ అంతకముందు ఒక్కటంటే ఒక్కటి కూడా చూడలేదు. అయిన నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పగించి, నాలో భయాన్ని పోగొట్టినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ తర్వాత నాకు అందుతున్న ప్రేమాభిమానాలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు” అని సమంత రాసుకొచ్చింది.