కోర్టులో సామ్ సినిమా..”యశోద” ఓటిటి రిలీజ్ కి బ్రేక్.!

రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యినటువంటి చిత్రాల్లో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన అవైటెడ్ చిత్రం “యశోద” కూడా ఒకటి. మరి హరి మరియు హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం ఓ ఆసక్తికర కాన్సెప్ట్ తో తెరకెక్కి భారీ సక్సెస్ ని అందుకొని 33 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకుంది.

అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు వచ్చినా థియేట్రికల్ రన్ ని త్వరగానే ఈ చిత్రం ముగించుకుంది. దీనితో లేట్ చెయ్యకుండా ఓటిటి లో కూడా ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే ఇప్పుడు యశోద డిజిటల్ రిలీజ్ కి బ్రేక్ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

యశోద చిత్రంపై ఓ ప్రముఖ హాస్పిటల్ వారు కేసు వేయగా దానితో కోర్టు యశోద చిత్ర యూనిట్ కి షాకిచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ హాస్పిటల్ వారు తమ పేరు వాడి సినిమాలో తీసి బయట మా రెప్యుటేషన్ తీసేలా చేసారని కోర్టుని ఆశ్రయయించగా న్యాయ స్థానం యశోద డిజిటల్ రిలీజ్ అందాకా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిందట. దీనితో ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారి వైరల్ అవుతుంది.