సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ సెన్సాన్‌ పూర్తి

టైగర్‌ ప్రాంఛైజీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్‌లో ఇప్పుడు ‘టైగర్‌ 3’ రాబోతుంది. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ టీజర్‌, ట్రైలర్‌లను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ క్లీన్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తెలుస్తుంది.

అలాగే సినిమా రన్‌ టైం విషయానికి వస్తే.. 157 నిమిషాలు (2 గంటల 33 నిమిషాల 38 సెకండ్స్‌) ఉన్నట్లు టాక్‌. కాగా దీనిపై మేకర్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. ‘టైగర్‌ 3’ మాస్‌ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్‌ అందుకుంటుందని మేకర్స్‌ ధీమాగా ఉన్నారు.

ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో విడుదల కాబోతుంది.