గాడ్ ఫాదర్ సినిమాలో నటించడం పై స్పందించిన సల్మాన్ ఖాన్… ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీ విడుదల కావడానికి సిద్ధమైంది.ఈ సినిమాని మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక జరుపుకోవాలని తాజాగా ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన విషయంపై స్పందిస్తూ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని తెలిపారు. సినిమా పట్ల చిరంజీవికి, నాకున్న ప్రేమే ఈ సినిమాలో నన్ను నటించేలా చేసిందని సల్మాన్ ఖాన్ తెలియజేశారు.

మొదటిసారి చిరంజీవితో కలిసి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను తప్పకుండా ఈ సినిమానీ ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మల్టీ స్టార్ సినిమాలు చేయడం చిత్ర పరిశ్రమకు ఎంతో మంచిదని తెలిపారు. ఈ విధంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులు కూడా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా సినిమాలను చూస్తారని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.