వెనుక నుండి పూల్‌లో ప‌డ్డ స్టార్ హీరో.. స్ట‌న్నింగ్ ఫీట్ చూసి షాకైన ఫ్యాన్స్

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌లో చేయ‌ని సాహ‌సాలు లేవు. ఎన్నో యాక్ష‌న్ సీన్స్, క‌ళ్ళు చెదిరే చేజింగ్ సీన్స్‌ల‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను స‌ల్మాన్ ఎన్నో సాహ‌సాలు చేస్తూ అభిమానుల‌ని థ్రిల్ చేస్తుంటారు. తాజాగా ఆయ‌న చేసిన ఓ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

సుల్తాన్ డైరెక్ట‌ర్ అలీ అబ్బాస్ జాఫ‌ర్ స‌ల్మాన్ ఖాన్‌కు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో షేర్ చేశాడు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ రాక్‌పైన నిలుచొని పూల్‌లోకి బ్యాక్ ఫ్లిప్ చేశాడు. ఈ బ్యాక్‌ఫ్లాప్ వీడియోలో స‌ల్మాన్ ముందుగా కాస్త బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌నిపించిన త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో సుల్తాన్ సినిమాలోని జ‌గ‌న్ గూమియా అనే పాట ప్లే అవుతుంది. ఇది పాత వీడియో అయిన‌ప్ప‌టికీ అలీ అబ్బాస్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఫుల్ వైర‌ల్‌గా మారింది.

కరోనా వ‌ల‌న కొన్నాళ్ల పాటు త‌న ఫాంహౌజ్‌కే ప‌రిమిత‌మైన స‌ల్మాన్ ఖాన్ అక్క‌డి సంగ‌తుల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌చ్చాడు. అంతేకాదు త‌న ఫాం హౌజ్‌లో పండిన కూర‌గాయల‌ని ప‌క్క‌న ఉన్న ఊళ్ళ‌ల్లో వారికి సాయం చేసి మంచి మ‌నసున్న మ‌నిషి అనిపించుకున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో క‌లిసి షార్ట్ ఫిలిం కూడా చేశాడు. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. కెరీర్ విష‌యానికి వ‌స్తే స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం రాధే చిత్రంతో బిజీగా ఉన్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. కిక్ 2, క‌బీ ఈద్ క‌బీ దీవాళి అనే సినిమాల‌తోను ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్న‌డు స‌ల్మాన్.