రెండో రోజు ట్రేడ్ కి షాకిచ్చిన సల్మాన్.!

గత కొంత కాలం నుంచి కూడా బాలీవుడ్ సినిమా ఎంతగానో ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కం బ్యాక్ లు అయితే అందనంత దూరంలో ఉన్న సమయంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” భారీ వసూళ్లతో అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో అయితే ఈ సినిమా మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఇంట్రెస్టింగ్ గెస్ట్ రోల్ లో కనిపించగా దీని తర్వాత సల్మాన్ సినిమాలపై కూడా మంచి బజ్ నెలకొంది.

అలా చేసిన లేటెస్ట్ సినిమానే “కిసీ కా భాయ్ కిసీ కి జాన్”. అయితే ఈ సినిమా ఓ రకంగా అటు నార్త్ తో పాటుగా సౌత్ సినిమా కలిపి చేసిన సినిమా అని చెప్పాలి. తమిళ నాట వీరం సినిమా తెలుగు కాటమరాయుడు రీమేక్ కాగా ఇందులో పూజ హెగ్డే, అలాగే విక్టరీ వెంకటేష్ లు నటించారు.

అయితే ఈ సినిమా రీమేక్ కాగా మొదటి రోజు చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. దీనితో ఈ సినిమా కూడా డిజాస్టరే అని చాలా మంది ఫిక్స్ అయ్యిపోయారు. కానీ ఇంట్రెస్టింగ్ గా సల్మాన్ ఖాన్ రెండో రోజు ట్రేడ్ వర్గాలకి షాకిచ్చాడు. మరి రెండో రోజుకి ఏకంగా 63 శాతం ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టి రెండో రోజు 25 కోట్లకి పైగా వసూలు చేసింది.

కానీ మొదటి రోజు కేవలం 15 కోట్లు పైగా మాత్రమే హిందీలో వసూలు చేసింది. దీనితో రెండో రోజుకి ఏకంగా 10 రోజులకి పైగా మార్జిన్ ని సెట్ చేసాడు. దీనితో రెండో రోజు మాత్రం సల్మాన్ ఖాన్ సత్తా చాటి లాంగ్ రన్ పై అసలు రేపాడు. మరి మాజికల్ ఫిగర్స్ ఎమన్నా ఈ సినిమా టచ్ చేస్తుందో లేదో చూడాలి.