Mega Star:మెగాస్టార్ గాడ్ ఫాదర్ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సల్మాన్ ఖాన్..!

Mega Star:మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్‌ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు మెగాస్టార్ చిరు – మోహన్ రాజా కాంబోలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి దగ్గరగా గాడ్ ఫాదర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ సినిమాలో స్పెషల్ ఏమిటి అంటే లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు కి సిస్టర్ కేరెక్టర్ లో పవర్ ఫుల్ రోల్ లో నటించడం. మరొక అదిరిపోయే స్పెషల్ ఏంటంటే చిరుకి బాడీ గార్డ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించడం. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ నయనతారా కంప్లీట్ చేసింది.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సెట్స్ లోకి సల్మాన్ ఖాన్ అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.మార్చ్ 12న కర్జాత్ లోని ND స్టూడియోస్ లో సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ కాంబో సీన్స్ ని దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించనున్నట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు నయనతార సల్మాన్ లాంటి టాప్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడం వలన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి. గాడ్ ఫాదర్ మూవీని తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉన్నందున, ఇలాంటి కాంబో ని మోహన్ రాజా చేశారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ,సల్మాన్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో వేచి చూడాలి.