సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం మూవీ థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మైథిలాజికల్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా గా శాకుంతలం సినిమాని గుణశేఖర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. విజువల్ గ్రాండియర్ గా త్రీడీ హంగులు అద్ది మరి ఈ సినిమాని ప్రేక్షకులకి అందించారు.
అయితే ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా కూడా కంటెంట్ లో దమ్ము లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు అనే విషయం శాకుంతలం సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఏ మాత్రం మెప్పించలేని కథ, కథనాలపై దర్శకుడు గుణశేఖర్ అనవసరంగా భారీగా ఖర్చు పెట్టారని విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమంత ఏమంత ఆసక్తిగా చేసినట్లు కనిపించలేదు.
రిలీజ్ కి రెండు రోజులు ముందు అనారోగ్యంతో హ్యాండ్ ఇచ్చారు. రిలీజ్ తర్వాత టాక్ పై క్లారిటీ వచ్చేయడంతో సింపుల్ గా వేదాంతం చెప్పి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శాకుంతలం తల్లి మేనకా పాత్రలో ఒకప్పటి హీరోయిన్ మధుబాల నటించారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాకుంతలం సినిమా రిజల్ట్ తనని బాధపెట్టిందని పేర్కొన్నారు.
నిర్మాతలు, దర్శకుడు ఈ మూవీకి భారీగా ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి తెరకెక్కించారు. అయినా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అసలు ఇది తాను ఊహించలేదని, ఫలితం చూశాక చాలా నిరాశకు గురైనట్లుగా మధుబాల పేర్కొన్నారు. శాకుంతలం సినిమా కూడా ఆర్ఆర్ఆర్, బాహుబలి స్థాయిలో నిలబడాల్సిన మూవీ అంటూ ఆమె తెలిపారు. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి. అదే రేంజ్ లో తీసిన మరి కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి అనేది డిసైడ్ చేయలేకపోతున్నామంటూ మధుబాల ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇప్పుడు శాకుంతలం రిజల్ట్ కూడా అలాగే ఊహించిన విధంగా ఉందని తెలిపారు. అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కథ, అంతకుమించి ప్రతి ఫ్రేమ్ లో పర్ఫెక్షన్ కనిపిస్తుందని, ప్రేక్షకులు ఎలాంటి అంశాలను సిల్వర్ స్క్రీన్ పై చూసినప్పుడు ఇష్టపడతారు అనేది కరెక్ట్ గా జడ్జ్ చేసి మరి రాజమౌళి ఆ సినిమాలను తెరకెక్కించారు. ఆడియన్స్ టెస్ట్ ని అబ్జర్వ్ చేయడంలో గుణశేఖర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని శాకుంతలం సినిమా చూస్తే తెలిసిపోతుంది. రాజమౌళి సినిమాలతో శాకుంతలంను ఏ విధంగా కూడా పోల్చి చూడలేము అంటూ తేల్చేశారు.