గ్లింప్స్ టాక్ : క్రేజీ విజువల్స్, పవన్ టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ చిత్రం.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి సెటిల్డ్ యంగ్ హీరోల్లో అయితే మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు. మరి సాయి తేజ్ అయితే కెరీర్ పరంగా మంచి హిట్స్ అందుకొని మళ్ళీ ప్లాప్ అందుకున్నాడు. దీనితో ఈసారి హిట్ అవుతున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా పట్టుకొని తన కెరీర్ లో 15వ సినిమా ని అయితే తాను చేస్తున్నాడు.

మరి ఈ చిత్రంపై ఈరోజు చిత్ర యూనిట్ టైటిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ టైటిల్ గ్లింప్స్ తో రిలీజ్ చేసిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ తో వాయిస్ ఓవర్ ఇప్పించి చేయించిన ఈ వీడియోలో పలు క్రేజీ సీన్స్ చాలా డిస్టబింగ్ గా కూడా ఉన్నాయి.

ఇక ఈ చిత్రానికి అయితే దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి మాత్రం సాయి తేజ్ తన మావయ్య సినిమా హరిహర వీరమల్లు కి ముందు అనుకోని బాగా వైరల్ అయ్యిన టైటిల్ “విరూపాక్ష” అనే ఫైనల్ చేయడం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా అయితే మారింది.

మరి ఈ సినిమాకి విక్రాంత్ రోనా మరియు రీసెంట్ సెన్సేషనల్ హిట్ చిత్రం కాంతారా సంగీత దర్శకుడు అజ్నీష్ లోకనాథ్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే మిడ్ రేంజ్ బడ్జెట్ చిత్రంగా నిర్మాత బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. 
Virupaksha Title Glimpse - Telugu | Sai Dharam Tej | Samyuktha Menon | Sukumar B | Karthik Dandu