సాయి పల్లవి రూటు మార్చబోతోందా.?

స్టార్‌డమ్ వున్నాగానీ, దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతోంది సాయి పల్లవి. కథల ఎంపికలో అతి శ్రద్ధ కాస్తా సాయి పల్లవి కెరీర్ కొంప ముంచేస్తోన్న సంగతి తెలిసిందే. ‘లేడీ పవర్ స్టార్’ అనే ఇమేజ్ సాయి పల్లవికి వుంది. అసలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్ని శరవేగంగా ఒప్పేసుకుంటున్నారాయె.

అలాంటిది సాయి పల్లవి ఇంకెంత హుషారుగా వుండాలి. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఎలాంటి సినిమాల్లేవు. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సాయి పల్లవి కూడా రూటు మార్చిందని సమాచారమ్.

ఒకేసారి రెండు మూడు సినిమాలకు సాయి పల్లవి కమిట్ కాబోతోందట. అయితే, గ్లామర్ విషయంలో ఆమెకి కొన్ని రిజర్వేషన్స్ వున్నాయ్. వాటికి అనుగుణంగానే ఈ ఏడాది పలు సినిమాలకు ఆమె కమిట్ అవుతోందని అంటున్నారు.

అంతేకాదు, ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తానని సాయి పల్లవి చెబుతోందిట తనను అప్రోచ్ అవుతున్న దర్శక నిర్మాతలకి. చూడాలి మరి, సాయి పల్లవి నుంచి ఎలాంటి సినిమాలు రానున్నాయో.!