Sai Pallavi : చిరంజీవి సరసన సాయిపల్లవి.. ఈసారి పక్కా.?

Sai Pallavi :  మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని తృటిలో తప్పించుకుంది హీరోయిన్ సాయిపల్లవి. లేదంటే, ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించేదే. రీమేక్ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందికరమంటూ, చిరంజీవితో వచ్చిన ఛాన్సుని వదులుకోవడంపై అప్పట్లో సాయిపల్లవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సాయిపల్లవి అలా చెప్పడంపై చిరంజీవి ఓ సందర్భంలో మాట్లాడుతూ, సాయిపల్లవి లాంటి డాన్సర్‌తో డాన్స్ చేయాలని తనకూ వుంటుందనీ, సాయిపల్లవి తన చెల్లెలిగా నటించడం కంటే, ఆమెతో డాన్స్ చేసే అవకాశం ఇంకా బావుంటుందేమోనని తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించారు.

చిరంజీవి సరసన హీరోయిన్‌గా అనలేంగానీ, ఓ సినిమాలో చిరంజీవితో కలిసి సాయిపల్లవి డాన్స్ చేయబోతోందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తాజా సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం సాయిపల్లవిని సంప్రదించారట. అది స్పెషల్ సాంగ్ కాదు, ఐటమ్ సాంగ్ కూడా కాదు.. కథలో భాగంగా వచ్చే ఓ ఇంపార్టెంట్ రోల్, దాంతోపాటే ఓ వెరీ వెరీ స్పెషల్ పాట కూడా.. అని అంటున్నారు.

ఇంతకీ, ఈ గాసిప్‌లో నిజమెంత.? ప్రస్తుతానికైతే చిరంజీవి ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’ రీమేక్ సినిమాలే. వీటితోపాటు మరో సినిమా వుంది.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అది. సో, సాయిపల్లవి నటించేది ఆ సినిమాలోనే అనుకోవచ్చా.?