పవర్ స్టార్ కి జోడీగా సాయి పల్లవి.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎవరూ ఊహించనిది ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాకంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ ల కంటే పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ పాత్రని తెలుగులో డిజైన్ చే శాడట దర్శకుడు.

Pawan Kalyan Vakeel Saab Movie Motion Poster Released 'వ‌కీల్ సాబ్' మోష‌న్  పోస్ట‌ర్.. అరుపులే..!

ఈ సినిమా తర్వాత తను కమిటయిన సినిమాలన్నిటిని కంప్లీట్ చేసేందుకు లైనప్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా అనూహ్యంగా దసరా పండుగ రోజున అనౌన్స్ అయిన మలయాళ సూపర్ హిట్ రీమేక్ “అయ్యప్పనం కోషియం” ని ముందు కంప్లీట్ చేసేలా ప్లాన్ జరుగుతున్నాయట. ఈ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందబోతుంది. ప్రముఖ దర్శక, రచయిత త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

కాగా ఈ సినిమాకి నటీనటుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి జంటగా నేచురల్ పర్ఫార్మర్ సాయి పల్లవి ని ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య తో లవ్ స్టోరీ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న విరాత పర్వం, నాని నటించబోతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో అవకాశం అందుకుందని వార్తలు వస్తుండగా అధికారకంగా మేకర్స్ ఈ విషయం వెల్లడించాల్సింది ఉంది. ఇదేగనక నిజమైతే పవన్ కళ్యాణ్ – సాయి పల్లవి ల కాంబినేషన్ మీద భారీ అంచనాలు మొదలవుతాయి.