అల్లు అర్జున్, సాయి పల్లవి.. సిస్టర్ సెంటిమెంట్

అల్లు అర్జున్, సాయి పల్లవి.. సిస్టర్ సెంటిమెంట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కాంబినేషన్స్ పై అప్పుడప్పుడు అనుకోకుండా బజ్ క్రియేట్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ తో నటిస్తే కూడా చాలా మంది హీరోయిన్స్ కు ఒక రకమైన క్రేజ్ అందుతుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న ఒక హీరోయిన్ అల్లు అర్జున్ సినిమాలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. సాయి పల్లవి.

Sai Pallavi
Sai Pallavi

మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో బాక్సాఫీస్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఆ సినిమాలోనే కాకుండా మరో మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సాయి పల్లవి, అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రకు చెల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. సిస్టర్ పాత్ర బలంగా ఉండాలని దర్శకుడు మొదట బాలీవుడ్ కు చెందిన కొందరి నటీమణులను అనుకున్నప్పటికి ఫైనల్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రూమర్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.