సీత పాత్రలో సాయి పల్లవి!

బాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ కనిపిస్తారు. రావణుడి పాత్ర కోసం యష్‌ని తీసుకున్నారు. సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇటివలే సాయి పల్లవి లుక్‌ టెస్ట్‌ లో పాల్గొన్నారని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా కోసం సాయి పల్లవి బల్క్‌ డేట్స్‌ కేటాయించారని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి 2024లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జులైలో యష్‌ సెట్స్‌లోకి జాయిన్‌ అవుతాడు. ఈ సినిమా కోసం మేకర్స్‌, టాప్‌ హాలీవుడ్‌ స్టూడియోస్‌ కలసి పని చేస్తున్నారు. మొదటి భాగం షూటింగ్‌ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.