మెగా ఇంట్లో పెల్లి బాజాలు మోగేందుకు అంతా సిద్దమవుతోంది. అది కూడా ఒక పెళ్లి కాదు. రెండు పెళ్లిళ్లు జరుగనున్నాయి. అందులో ఒకటి మెగా డాటర్ నిహారికది ఆల్రెడీ ఫిక్స్ అయింది. నిహారిక-చైతన్యల వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందని టాక్ వినిపించింది. అయితే తాజాగా మెగా ఇంట్లో మరో పెళ్లి కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతోన్నాడని సమాచారం. ఈ మేరకు నేటి ఉదయం నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్‌కు ఇప్పుడు 33 ఏళ్లు. మెగా ఫ్యామిలీలో ఈ వయసు వచ్చే వరకు ఎవ్వరూ ఆగలేదు. అందరూ 30లోపే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు కూడా సరైన సమయంలో పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు.
అందుకే సాయి ధరమ్ తేజ్ విషయంలో అతని తల్లి విజయ దుర్గ ఓ సంబంధాన్ని చూసి ఫిక్స్ చేశారట. సాయి ధరమ్ తేజ్ కూడా తలూపడంతో ఈ సంబంధం గురించి చిరంజీవి వద్ద ప్రస్థావించడంతో ఓకే చెప్పేశాడట. దీంతో గ్యాప్ లేకుండా వెంటనే పెళ్లి చేసేద్దామని నిశ్చయించుకున్నారట. కానీ సరైన ముహూర్తాలు లేనందున.. వచ్చే ఏడాది వేసవికి షిఫ్ట్ చేసినట్ట తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు ఫ్యామిలీ వివరాలేంటి అనేవి మాత్రం బయటకు రాలేదు. అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ తేజ్ స్పందించాల్సి ఉంది.