సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే ట్యాగ్‌తో బాగానే లాక్కొస్తున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి, నితిన్ వంటి వారు చేసిన ట్వీట్లు కూడా అనుమానాన్ని రేకెత్తించాయి. సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ చివరకు సాయి ధరమ్ తేజ్ మాత్రం పెళ్లి వార్తలపై వెరైటీగా స్పందిస్తున్నాడు.
తాను మాత్రం ఇప్పుడే పెళ్లికి రెడీగా లేనని సాయి ధరమ్ చెప్పుకొచ్చాడు. కానీ తాము ఎంత స్ట్రాంగ్‌గా పెళ్లి వద్దని అనుకుంటామో.. మదర్స్ మాత్రం అంతే స్ట్రాంగ్‌గా పెళ్లి చేయాలని పట్టు బడతారంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. పెళ్లి అంటే ఓ బాధ్యత అని, తనకు కొన్ని లక్ష్యాలున్నాయని, అవి తీరాకే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా తన పెళ్లిపై మెగా బ్రదర్స్ చేసిన కామెంట్స్‌ను బయట పెట్టాడు సుప్రీమ్ హీరో.
తాజాగా సాయి ధరమ్ తేజ్ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో సుమ అడిగిన ప్రశ్నకు మెగా హీరో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు సోలో బ్రతుకే సో బెటర్‌గా ఉంటేనే లక్కీరా అని అన్నారట. కానీ నాగబాబు మాత్రం వెరైటీగా అన్నాడట. మేం పెళ్లి చేసుకుని బాధలు పడుతున్నాం కదా నువ్ కూడా పడాలి రారా అని పెళ్లి చేసుకో అని అంటున్నాడట.