రివ్యూ : శాకిని డాకిని
నటీనటులు: రెజీనా కసాండ్రా, నివేదా థామస్ తదితరులు.
దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్
సంగీత దర్శకుడు: మైకీ మెక్‌క్లియరీ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘శాకిని డాకిని’. డిఫరెంట్ క్రైమ్ డ్రామా అంటూ ప్రమోట్ చేశారు ఈ సినిమాని. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం రండి.
కథ :
శాలిని (నివేతా థామస్) పెద్ద తిండిపోతు. బాధలో కూడా ఫుడ్ ను ఇష్టంగా తింటుంది. డామిని (రెజీనా) ఎలాగైనా అమెరికా వెళ్ళిపోయి నచ్చిన జీవితాన్ని గడపాలని కలలు కంటుంది. అయితే ఈ ఇద్దరు పోలీస్ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీకి వస్తారు. ఏ మాత్రం ఆసక్తి లేకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ మధ్యలో ఈ ఇద్దరి మధ్య ఇగో సమస్య వస్తోంది. దాంతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు. ఒకర్ని ఒకరు బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం శాలిని – డామిని బెస్ట్ ఫ్రెండ్స్ గా మారతారు. అయితే, శాలిని పబ్ కి వెళ్ళాలని ఆశ పడుతుంది. ఓ రోజు రాత్రి డామిని, శాలిని పబ్ కి తీసుకు వెళ్తుంది. అక్కడ వీరి జీవితాలు అనుకొని ప్రమాదంలో పడతాయి. ఓ అమ్మాయి కిడ్నాప్ అవ్వడం వీళ్ళు చూస్తారు. ఆ అమ్మాయిని ఎలాగైనా సేవ్ చేయాలని రిస్క్
చేస్తారు. ఇంతకు శాలిని – డామిని చేసిన రిస్క్ ఏమిటీ ?, చివరకి శాలిని – డామిని ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేశారు? ఫైనల్ గా ఈ ఇద్దరు అనుకున్నది సాధించారా? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరు పోటీ పడి నటించారు. దాంతో, ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం కాస్త పాత్రల పరిధి దాటి ఓవర్ యాక్షన్ కూడా చేశారు. కానీ, శాలిని గా నివేతా థామస్, డామిని గా రెజీనా తమ పాత్రల కోసం పడిన కష్టాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి. యాక్షన్ సీన్స్ లో కూడా భారీ స్టంట్స్ చేయడం బాగుంది. మెయిన్ గా క్లైమాక్స్ లో ఈ ఇద్దరు పవర్ ఫుల్ పాత్రల్లో తమ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆపరేషన్స్ చేసే భావోద్వేగ సీన్స్ లో రెజీనా నటన చాలా బాగుంది. ఇక బానుచంద్ర తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కానీ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకి కనీస స్థాయిలో కూడా న్యాయం చేయలేడు.
ఇలాంటి సిల్లీ డ్రామాను సుధీర్ వర్మ ఎలా తీశాడు? అని ఆశ్చర్య పోయేలా చేసాడు ఆయన తన దర్శకత్వ పనితనంతో. విలన్ పాత్రలో నటించిన నటుడు నుంచి సరైన నటన ను సుధీర్ వర్మ రాబట్టుకోలేకపోయాడు. అసలు ఈ శాకిని డాకిని సినిమాలో ప్రతి సీన్ లో ఎన్నో లొసుగులు ఉన్నాయి. పైగా ఏ సీన్ ఇంట్రెస్ట్ గా సాగదు. అన్నిటికీ మించి సింపుల్ పాయింట్ తో శాకిని డాకిని సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు ఈ ‘శాకిని డాకిని’ ను పూర్తిగా ముంచాయి.
ఈ సినిమాలో మరో దరిద్రం ఏమిటంటే.. శాకిని డాకిని కథ కంటే ఈ సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉంది. పైగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇక సాగదీత సీన్స్ కూడా బాగా విసిగించాయి. మెయిన్ గా రెజీనా పాత్ర తాలూకు మెలో డ్రామా కూడా బాగా విసిగించింది. నివేదా పాత్ర బాగున్నా.. ఆమె ఓవర్ యాక్షన్ బాగా ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్,
నేపథ్య సంగీతం,
కొన్ని క్రైమ్ సీన్స్.
మైనస్ పాయింట్స్ :
నీరసంగా సాగే రెగ్యులర్ క్రైమ్ డ్రామా,
బోరింగ్ అండ్ రొటీన్ సీన్స్,
మ్యాటర్ లేని డైరెక్షన్,
బ్యాడ్ రైటింగ్.
లాజిక్ లెస్ ఇన్వెస్టిగేషన్,
తీర్పు :
శాకిని డాకిని అంటూ వచ్చిన ఈ ‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్’ లో
అటు బలమైన సస్పెన్స్ లేదు, ఇటు బలమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. పక్కా బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కహానీలు ఏమీ లేవు. సినిమా బాగాలేదు.
రేటింగ్ : 2/ 5