రెజీనా కసాండ్రా, నివేదా థామస్, ‘శాకిని డాకిని’ టీజర్ విడుదల

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

రెజీనా, నివేదాలను పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకిని టీజర్ విడుదలైయింది. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంది. అలాగే ట్రైనింగ్ లో వీరిద్దరూ వెనకబడ్డారు. పైగా అనవసరమైన గొడవల జోకిలికి వెళ్తున్నారు. టీజర్ లో ఒక క్రిమినల్ అమ్మాయి తలపై రాడ్డుతో కొట్టడం, తర్వాత రెజీనా, నివేద చేసిన కొన్ని యాక్షన్ స్టంట్స్ అసలు కథపై ఆసక్తిని పెంచాయి.

టీజర్‌ను బట్టి చూస్తే.. ‘శాకిని డాకిని’ ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, బలమైన కథ, డ్రామా కూడిన సినిమాని అర్ధమౌతోంది. రెజీనా, నివేదా పాత్రలు బ్రిలియంట్ గా వున్నాయి. కొన్ని సన్నివేశాలలో డేర్‌డెవిల్స్‌గా కనిపించడం ఆకట్టుకుంది. థ్రిల్లర్‌లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు సుధీర్ వర్మ.. ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించారు.

రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం రిచ్ గా వుంది. మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్ ద్వయం తమ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేశారు. విప్లవ్ నైషధం ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా వుంది.

కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్స్‌తో టీజర్ సినిమా పై పాజిటివ్ ఇంప్రెషన్‌ని కలిగించింది.

నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు:రెజీనా కసాండ్రా, నివేదా థామస్

సాంకేతిక విభాగం
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్
సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, స్టీవెన్ నామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ
నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్
ఎడిటర్: విప్లవ్ నైషధం
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్: అక్షయ్ పూల్లా
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
ఫైనాన్స్ కంట్రోలర్: జి. రమేష్ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ మార్కెటింగ్: లిపికా అల్లా, నిహారిక గాజుల
పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను