అందం ఆరబోసిన…. రుహానీశర్మ!

రుహానీ శర్మ తెలుగునాట ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేస్తున్న నటి ఈ ముద్దుగుమ్మనే. సుశాంత్‌ హీరోగా వచ్చిన ‘చి.ల.సౌ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హిమాచల్‌ సుందరి ఆ తర్వాత హిట , నూటొక్క జిల్లాల అందగాడు, హర్‌, డర్టీ హరి వంటి చిత్రాలతో పాటు సంక్రాంతికి విడుదలైన ‘సైంథవ్‌’, మార్చిలో విడుదల కానున్న ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’ చిత్రాలలోను నటించింది.

గ్లామర్‌ విషయంలో ఎలాంటి మోహమాటం లేని ఈ అమ్మడు హీరోయిన్‌ గానే చేస్తా అని మడి కట్టుకోని కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోన్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో బిజీ అర్టిస్ట్‌గా మారింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘శ్రీరంగనీతులు’ త్వరలో విడుదల కానుండగా.. మరో నాలుగైదు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు లైన్‌లో పెట్టింది.

ఇక తను చేసే పాత్రల్లో అవసరమైతే అంతకుమించి అనేలా అంగాంగ ప్రదర్శనలు, ఇంటిమేట్‌ సన్నివేశాలలోనూ ఎలాంటి జంకు లేకుండా నటించండం ఈ అమ్మడి ప్రత్యేకత. ఇప్పటికే తన గ్లామర్‌ షోతో, బోల్డ్‌ యాక్టింగ్‌తో తనకంటూ సపరేటు అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న రుహనీ సోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం తను పాల్గొనే ఫొటో షూట్లతో పాటు, విహారయాత్రల ఫొటోలను, షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రను దూరం చేస్తోంది. తాజాగా కాసేపటి క్రితం అంతకుమించి అనేలాంటి ఫొటోలను షేర్‌ చేయగా ఆ ఫొటోలు సోషల్‌విూడియాకు పట్టిన బూజును దులిపేస్తున్నాయి.