రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. యశ్ గ్రీన్ సిగ్నల్?

అధికారికంకాకపోయినా స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు భారీ అంచనాలు పెంచుతుంటాయి. కన్నడ స్టార్ హీరో యశ్‌ విషయంలో అదే జరుగుతోంది. ఓ భారీ ప్రాజెక్టులో ఆయన అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజుల నుంచి వస్తున్న కథనాలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఆ వివరాలే ఈ కథనం…

కన్నడ రాకింగ్ హీరో యశ్ గురించి మనందరికీ తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీని సృష్టించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమాలు చేస్తాడు అన్న విషయాలపై చాలా కాలంగా సందిగ్దత నెలకొంది.

పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడా? ఏ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నాడు? అందులో హీరోయిన్ ఎవరు? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతునే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రశ్నలపై ఉన్న క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే యశ్ కు ఎన్నో భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన కథలు వింటూ వస్తున్నారె తప్ప ఓకే చేయట్లేదు.

ఈ క్రమంలోనే భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తెరకెక్కనున్న రామాయణం లో నటించడానికి యశ్ ఆసక్తి చూపుతున్నట్లు కొద్ది రోజుల క్రితం కథనాలు వచ్చాయి. ఇందులో యశ్ కు రావణాసురుడు పాత్ర చేసే అవకాశం వచ్చిందని ప్రచారం సాగింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రకు యశ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. దీంతో సోషల్ మీడియా లో మరోసారి ఈ ప్రచారం హోరెత్తింది. ఫ్యాన్స్ ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు

కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్ర, మధు మంతెనలు దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించాలని కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ణయించారు. నితీశ్‌ తివారి దర్శకుడిగా వ్యవహరించే ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పట్టాలెక్కలేదు కానీ తాజా వార్తతో మళ్లీ ఆసక్తి పెంచుతోంది.

ఒకవేళ నిజంగానే యశ్ ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాలో రాముడుగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.