టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న భారీ స్టార్డం ఉన్న స్టార్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అని తెలిసిందే. మరి తన విశేష ప్రజాధారణ అందరికీ ఆశ్చర్యకరం కాగా ఇపుడు పలు భారీ చిత్రాలతో పవన్ కళ్యాణ్ ఇపుడు బిజీగా ఉండడమే కాకుండా ఈ చిత్రాలతో పాటుగా పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఫుల్ యాక్టీవ్ గా ఉన్నారు.
మరి ఈ రకంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఓ ఛానెల్ లాంచ్ లో తాను పాల్గొనగా ఈ ఈవెంట్ లో తనతో పాటుగా టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమా నెంబర్ 1 సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే పవన్ పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను రీసెంట్ గా ఒక బ్యూటిఫుల్ విజువల్ చూశానని.
అయితే అందులో హిందువులు ముస్లింలు కూడా కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారని హిందువుల కోసం ముస్లిం లు మజ్జిగ పంచుతూ కనిపించడం నాకు ఇలాంటి భారతదేశం కావాలి అని కోరుకునేవాడిని అయితే అయితే ఇప్పుడు రాజకీయం అంటేనే దోచుకోవడం లా అయిపొయింది నిజాయితీ ఉన్న నాయకులు తక్కువ మంది ఉన్నారు.
అలంటి వారిలో అశేషమైన ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు మీరు మీ అభిమానులని ప్రేరేపించి అయినా కూడా ఒక మతసామర్యం లేని సమాజాన్ని తీసుకురావాలని విన్నవించుకుంటున్నాను సర్ అని అయన తెలిపారు. దీనితో RRR రచయిత అయినటువంటి తాను చేసిన కామెంట్స్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.