RRR:ఆర్ఆర్ఆర్ ఓటిటి రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

RRR Movie Booked

RRR:టాలీవుడ్ బాలీవుడ్ తేడాలేకుండా ఇండియా మొత్తం సినిమా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్,చరణ్ మల్టీస్టారర్ గా చేసిన ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే ఈ సినిమా చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మార్చి 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయి.

ఇటీవల రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓ టి టి లో సందడి చేస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓ టి టి లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలతో రిలీజ్ అయిన వెంటనే ఓ టి టి కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇంకా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా దీని శాటిలైట్, డిజిటల్ హక్కుల మాత్రం కొన్ని కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 90 రోజులకు ఓ టి టి రిలీజ్ అవుతుందట.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ్, మరియు మలయాళం భాషల డిజిటల్ హక్కులను జీ5 కంపెనీ సొంతం చేసుకుందట. వీటితో పాటు ఆర్ ఆర్ ఆర్ హిందీ వెర్షన్ కు సంబంధించిన శాటిలైట్ హక్కులను కూడా జీ5 సొంతం చేసుకుంది. జీ గ్రూప్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన అన్ని శాటిలైట్ హక్కులను,డిజిటల్ హక్కులను 300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళ్ ,కన్నడ మరియు మలయాళం భాషల శాటిలైట్ హక్కులను స్టార్ ఇండియా నెట్ వర్క్ కొనుగోలు చేసిందట. దీన్నిబట్టి ఆర్ఆర్ఆర్ తెలుగు – స్టార్ మా, ఆర్ఆర్ఆర్ హిందీ – జీ సినిమా, ఆర్ఆర్ఆర్ తమిళం – స్టార్ తమిళం, ఆర్ఆర్ఆర్ మలయాళం – ఏషియానెట్ ఛానల్, ఆర్ఆర్ఆర్ కన్నడ – స్టార్ కన్నడ లో ప్రసారం కాబోతుంది.