RRR : ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరొక వీడియో సాంగ్…

RRR : మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఎంతటి ఘనవిజయాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో భీం పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ కు రామ్ చరణ్ కి ఈ సినిమాలో జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ లు నటించారు.

ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాకపోతే కేజిఎఫ్ 2 సినిమా విడుదల అవ్వడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు కాస్త బ్రేకులు పడ్డట్లు అయ్యింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్ని పాటలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే నాటు నాటు సాంగ్ ను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు మరొక పాటను విడుదల చేసింది.

YouTube video player

నాటు నాటు’ పూర్తి వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా.. దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తాజాగా ‘కొమ్మ ఉయ్యాలా, కోనా జంపాలా’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట సినిమాకి చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొత్తం ఈ పాట చుట్టూనే తిరుగుతుంది.ఇప్పుడు ఈ పూర్తి పాటను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇందులో ఒకట్రెండు సీన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం కొమరం భీముడో పాటని కూడా త్వరగా విడుదల చేయాలనీ కోరుకుంటున్నారు.