RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా…అంటూ పాట గూస్ బంప్స్ పక్కా అంటున్న నెటిజన్స్..!

RRR : ఆర్ఆర్ఆర్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా జనవరిలోనే విడుదల కావాల్సినా కరోనా వల్ల వాయిదా పడి చివరకు మార్చి 25నా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఆలియా సీత గా కనువిందుచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు సినిమా మీద అంచనాలను బాగా పెంచాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఉత్కంఠంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ లోను రిలీజ్ అవ్వబోతోంది. అంతే కాకుండా విదేశీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు.సంక్రాంతికే సినిమా విడుదల అవుతుందని అనుకున్నారు అందరు. చిత్ర యూనిట్ కూడా ప్రొమోషన్స్ బాగా చేసింది.కరోనా ఎక్కువగా అవడంతో సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇక తాజాగా మరో విడుదల తేదిని ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. మార్చి 25 నా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో మళ్ళీ సినిమా ప్రొమోషన్స్ పై చిత్రా యూనిట్ దృష్టి పెట్టింది.

YouTube video player

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎత్తర జెండా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజగా రిలీజ్ చేశారు చిత్రబృందం. చరణ్, తారక్ ఇద్దరు జెండాలతో నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా అంటూ పాడుతుండగా మధ్యలో అలియా కూడా వారితో చిందులు వేస్తూ కనిపించింది. ఈ ఫుల్ సాంగ్ మార్చ్ 14 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.