RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో బిగ్ అప్డేట్

RRR Movie: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి ఫ్యాన్స్ కి అదిరిపోయే శుభవార్త చెప్పింది చిత్రబృందం. ఈ సినిమా నుండి నాలుగో సింగిల్ లైన్ విడుదల తేదీ ని ఫైనల్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బృందం. రేపు ఉదయం 11.30 గంటలకు ‘Revolt of Bheem’ పేరుతో సాంగుని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఈ సాంగ్ కొమరం భీమ్ గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంటుందని ఈ అనౌన్సమెంట్ ద్వారా మనకి అర్ధమవుతుంది.

అయితే ఈ తాజా అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకుంది. కాగా ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రని రాంచరణ్ పోషిస్తుండగా, కొమరంభీం పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు ‘జక్కన్న’ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. మరి నాలుగో పాట ఎటువంటి దుమారం లేపుతుందో చూడాలి.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు అలియాభట్, అజయ్ దేవగన్ లు కీలకపాత్రలను పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.