RRR – 1300 కోట్లు నాటౌట్…కానీ ఇంకా ఉంది 

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసిన చిత్రాల్లో నెమ్మదిగా గ్లోబల్ సెన్సేషనల్ గా మారిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీలే తెలిసిందే. మరి ఈ చిత్రం ఏకంగా ఆస్కార్ వరకు కూడా వెళ్లి ఇండియన్ సినిమాకి సరికొత్త దారి వేసింది.

కాగా ఈ చిత్రం అప్పుడుకి వరల్డ్ వైడ్ గా అయితే మొత్తం 1200 కోట్లు భారీ వసూళ్లు నమోదు చేయగా ఇప్పుడు ఈ చిత్రం అయితే ఏకంగా మరో 100 కోట్ల వసూళ్ళని వరల్డ్ వైడ్ రన్ తో అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం గత ఏడాది జపాన్ లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళ్తుంది.

అయ్యితే ఈ మాసివ్ చిత్రం అక్కడ వసూళ్లతో కలిపి లేటెస్ట్ గా 1300 కోట్లు నాటౌట్ గా నిలవగా ఇపుడు ఈ చిత్రం ఇండియన్ సినిమా నుంచి ఆల్ టైం టాప్ 3 గ్రాసర్ గా ఇపుడు నిలిచింది. మొదటగా దంగల్ చిత్రం 2000 కోట్లకి పైగా గ్రాస్ అలాగే నెక్స్ట్ బాహుబలి 1800 కోట్లు ఇక ఇక మూడో స్థానంలో అయితే లేటెస్ట్ గా 1300 కోట్ల వసూళ్లతో RRR మూడో స్థానంలో నిలిచి ఇండియన్ సినిమా టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు వరకు జపాన్ లో ఈ చిత్రం తెలుగు వెర్షన్ జపాన్ సబ్ టైటిల్స్ తోనే ఇన్ని రోజులు రన్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో కంప్లీట్ ఆ జపాన్ వెర్షన్ లో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత వసూళ్లు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.

దీనితో అక్కడ నుంచి మరింత స్థాయిలో ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదు చేస్తుంది అని చెప్పాలి. మరి ఈ సంచలన చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.