మాసివ్ RRR..105వ రోజు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్.!

1121107-rrr

కొన్ని సినిమాలు చరిత్ర సృష్టించడం ఏమో కానీ మరికొన్ని చిత్రాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయే హిస్టారికల్ రన్ ని అయితే ఊహించని లెవెల్లో సెట్ చేసి పెడతాయి అలాంటి సినిమాలు తీయడమే లక్ష్యం అన్నట్టుగా చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్తున్నాయి.

మరి అలా తాను చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా “ఆర్ ఆర్ ఆర్” సినిమా ఊహించని హిస్టారికల్ రన్ ని నమోదు చేస్తుంది. ఇది మన తెలుగు లో అనుకుంటే పొరపాటే తెలుగులో అయిపోయాక ఇటీవల గత అక్టోబర్ లో జపాన్ దేశంలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నిజంగా అక్కడ మైండ్ బ్లాకింగ్ రన్ తో దూసుకెళ్తుంది.

అక్కడ ఆల్రెడి 120 మిలియన్ జపాన్ యిన్స్ ని క్రాస్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా మరో భారీ రికార్డు సెట్ చేసిందట. అక్కడ 5 లక్షల 13 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి తెగగా ఈ సినిమా 105 రోజున వసూళ్లు రిలీజ్ రోజు కన్నా ఎక్కువ వచ్చాయి అంట. దీనితో జపాన్ లో ఆడియెన్స్ కి ఈ సినిమా ఏ రేంజ్ లో నచ్చిందో ఏ రేంజ్ లో లాంగ్ రన్ ని కొనసాగిస్తుందో అర్ధం చేసుకోవాలి.

దీనితో ఈ సినిమా 1 బిలియన్ జపాన్ యిన్స్ సునాయాసంగా క్రాస్ చేస్తుంది అని ట్రేడ్ అంటున్నారు. కాగా ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా కీరవాణి ఇచ్చిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది.