లేటెస్ట్ : ఇప్పుడు జపాన్ లో ‘RRR’ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.!

బాహుబలి లాంటి రెండు బిగ్గెస్ట్ వండర్స్ తర్వాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన మరో ఎపిక్ వరల్డ్ బాక్సాఫీస్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). ఇద్దరి బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా ఎంతో ఆదరణ వరల్డ్ వైడ్ అందుకుంటూ దూసుకెళ్తుంది.

మరి లేటెస్ట్ గానే యూఎస్ లో భారీ వసూళ్లు రీ రీ రిలీజ్ తో నమోదు చెయ్యగా ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం జపాన్ దేశంలో కూడా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం జపాన్ లేటెస్ట్ వసూళ్ల వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి.

మరి ఈ చిత్రం అక్కడ విడుదల అయ్యిన నాలుగో వారాంతంలో 19.3 మిలియన్ జపాన్ యిన్స్ వసూలు చేయగా డాలర్స్ లో అయితే 1 లక్ష 38 వేల డాలర్స్ కి పైగా రాబట్టగా టోటల్ గా ఇప్పటివరకు 1.7 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టిందట.

దీనితో మన దేశపు కరెన్సీ ప్రకారం ఈ చిత్రం 14 కోట్ల గ్రాస్ ని RRR జపాన్ నుంచి వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికీ అయితే జపాన్ లో ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని కొల్లగొడుతుంది. ఇంకా అక్కడ మిలియన్స్ కొద్దీ యిన్స్ వసూలు అవుతున్నాయి అంటేనే అర్ధం చేసుకోవాలి.