RRR : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కి సంబందించిన సీన్ ఒకటే కాదు పాటకి కూడా కత్తెర పడిందట..?

RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరో లు గా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. విడుదల అయిన రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గొప్పదనాన్ని నలుదిక్కుల చాటింప చేసింది.ఈ ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఆర్ఆర్ఆర్ సినమా నిడవి దాదాపు 3గంటలు. ఇక సినిమా విడుదలకు ముందు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారనే వాదన వినిపించింది. రన్ టైం ఎక్కువ ఉండటమే దీనికి కారణం.ఎన్టీఆర్ నటించిన కొన్ని సన్నివేశాలు అలియాభట్, రామ్ చరణ్ మధ్య సన్నివేశాలను సినిమాలో కత్తిరింపులో వెళ్లిపోయాయని వినిపించింది.

ఇక సినిమాలో అలియాభట్ నటించినా సన్నివేశాలు ఎక్కువ లేకపోవడంతో ఆమె అలిగిందని వార్తలు మొదట్లో గుప్పుమన్నాయి. ప్రచారాల్లో అంతా హడావిడి చేసిన ఆలియా సినిమాలో కేవలం రెండూ మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవడంతో ఆమె అభిమానులు హర్ట్ అయ్యారు.ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాలు డిలీట్ చేసారని వాదన వినిపించింది. ఇక ఎపుడు లేటెస్ట్ గా మరో వార్త వైరల్ అవుతోంది.

సినిమాలో ఎవరు ఊహించని విధంగా ఓలివియా మోర్రీస్,ఎన్టీఆర్ మధ్యాహ్నం సాగే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.వారిద్దరి మధ్య ప్రేమను చూపించి చూపించినట్టు భలే చూపించారు దర్శకుడు రాజమౌళి. కానీ షూటింగ్లో భాగంగా చిత్రీకరించిన చాలా సన్నివేశాలను జక్కన్న డిలీట్ చేసాడట.లేదంటే రన్ టైం 4 గంటల వరకు వెళ్ళేదే.ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ఉందనీ దాన్ని సినిమా నిడివి ఎక్కువ అవడంతో తొలగించారని చెప్తున్నారు. 3నిముషాలు సాగే ఈ పాట అప్పటికే సినిమా రన్ టైం ఎక్కువ ఉందని తొలగించారట. ఇక రామ్ చరణ్ అలియా భట్ మధ్యకూడా ఒక రొమాంటిక్ సాంగ్ సగం షూటింగ్ చేసి ఆపేసారట.అయితే ఓలివియా, ఎన్టీఆర్ మధ్య పాటను యూ ట్యూబ్ లో త్వరలో విడుదల చేస్తారని అంటున్నారు.