వైరల్ : మరో చరిత్ర సృష్టించిన “RRR” వసూళ్లు.!

1121107-rrr

ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న ఏకైక తెలుగు సినిమా పేరు ఏదన్నా ఉంది అంటే అది మన ఆర్ ఆర్ ఆర్ సినిమానే అని చెప్పాలి. కాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మాసివ్ హిట్ వరల్డ్ క్లాస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ మరియు స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది.

దీనితో వసూళ్లతో మాత్రమే కాకుండా బిగ్గెస్ట్ థియేట్రికల్ రన్ తో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా అదరగొట్టింది. కాగా ఈ మాసివ్ హిట్ అయితే గత కొన్నాళ్ల కితం జపాన్ దేశంలో డబ్ అయ్యి రిలీజ్ కాగా అక్కడ మైండ్ బ్లాకింగ్ రన్ అయితే అందుకొని ఇప్పటికీ స్టాండర్డ్ గా దూసుకెళ్తుంది.

కాగా ఈ సినిమా అక్కడ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా ఆల్రెడీ నిలవగా అక్కడ నుంచి ఈ సినిమా ఎక్కడా ఆగలేదు. ఉండి ఉండి మరింత శాతం వసూళ్లు పెరిగాయి కానీ తగ్గలేదు. దీనితో ఈ భారీ సినిమా అక్కడ అప్పుడు సెట్ చేసిందే ఓ హిస్టరీ అయితే ఇక ఇప్పుడు మరో చరిత్ర సృష్టించినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

అక్కడ ఇపుడు ఈ సినిమా ఏకంగా 1 బిలియన్ జపాన్ వసూళ్లు అందుకుందట. ఇలా ఓ దేశంలో 1 బిలియన్ వసూళ్లు అందుకోవడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. అక్కడి సినిమాలు ఇలాంటి అరుదైన ఫీట్ ని సెట్ చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ..

ఓవర్సీస్ నుంచి వచ్చిన ఓ సినిమా ఇలాంటి సెన్సేషనల్ మార్క్ ని అందుకోవడం అనేది నెవర్ బిఫోర్ అని చెప్పాలి. మరి దీనికి కారణం సినిమా కంటెంట్ తో పాటుగా ఎన్టీఆర్ రాజమౌళి మరియు రామ్ చరణ్ లకి కూడా అక్కడ ఉన్న క్రేజ్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు.