3 దేశాల్లో 100 కోట్లు..’RRR’ క్రేజీ రికార్డ్.!

rrr-4-weeks-japan-collections_b_1711221021

ఇండియన్ సినిమా దగ్గర గ్లోబల్ వైడ్ గా ప్రైడ్ ఇండియన్ సినిమాగా నిలిచిన ఎన్నో చిత్రాల్లో గత ఏడాది హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. మరి ఈ సినిమాని జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.

మరి ఈ సినిమాకే ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా ఇండియా కి తీసుకొని రాగా ఇప్పటికీ ఈ సినిమా ఎన్నో యూనిక్ అండ్ రేర్ రికార్డులు నెలకొల్పుతూ ఉండడం గమనార్హంగా మారింది. అయితే ఈ సినిమా గ్లోబల్ హిట్ కాగా ఈ సినిమా ఇప్పుడు మూడు దేశాల్లో 100 కోట్లు గ్రాస్ కలిగిన సినిమాగా రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి మొదటగా ఇండియా లో 100 కోట్లు ఎలాగో వచ్చాయి. అలాగే నెక్స్ట్ యూఎస్ లో అయితే భారీ వసూళ్లతో మిలియన్ డాలర్ వసూళ్లు సాధించి యూఎస్ లో కూడా 100 కోట్లు కి పైగా గ్రాస్ ని ఈ సినిమా రాబట్టింది. అలాగే నెక్స్ట్ ఇపుడు తాజాగా అయితే జపాన్ దేశంలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా తెలుస్తుంది.

అక్కడ ఈ సినిమా 1.6 బిలియన్ పైగా జపాన్ యిన్స్ వసూళ్లు రాబట్టగా దీనితో 100 కోట్ల గ్రాస్ ఇండియన్ కరెన్సీ తో వచ్చింది. ఇలా మూడు దేశాల్లో 100 కోట్లు గ్రాస్ వసూళ్లు కలిగిన ఏకైక ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు ఓ క్రేజీ అండ్ అరుదైన రికార్డు నెలకొల్పి భారతీయ సినిమా దగ్గర మరో ఘనతను సొంతం చేసుకుంది.