RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ కంటే హై రేంజ్ లో నెవర్ బిఫోర్ అనేలా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రజలే కాకుండా తమిళ్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక నేడు అలియా భట్ కూడా చిత్ర యూనిట్ తో కలవడంతో షూటింగ్ మరింత స్పీడ్ అందుకోనుంది. అయితే ఆమె రాకతో ఇప్పుడోక గాసిప్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
అలియా భట్ రెమ్యునరేషన్ పై గతంలోనే అనేక రకాల రూమర్స్ వచ్చాయి. తక్కువ డేట్స్ ఇవ్వడంతో ఆమె రెమ్యునరేషన్ మాదిరిగా కాకుండా డైలీ పేమెంట్ తీసుకొనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు యొక్క పాత్రకు జోడిగా సీత అనే క్యారెక్టర్ చేస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక్కరోజుకు 50లక్షల వరకు అందుకుంటోందని సమాచారం. ఇక ముంబై నుంచి ఆమె వెంట 10 మందికి పైగా స్టాఫ్ వచ్చారు.
నలుగురు బౌన్సర్స్ తో పాటు ఒక హెయిర్ స్టయిలిష్ట్, మేకప్ అసిస్టెంట్, కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్ అసిస్టెంట్, మేనేజర్, అలాగే డ్రైవర్ కూడా సొంతంగా ఉండాలని కండిషన్ పెట్టిందట అలియా భట్. ఇక రోజు ఆ పది మందికి పేమెంట్స్ తో పాటు స్టార్ హోటల్ లో వసతి కల్పించడం అలాగే ఇష్టమైన తిండి కూడా ఏర్పాటు చేస్తున్నారట. దీంతో రోజుకు ఒక్క స్టాఫ్ మెంబర్ కు లక్ష ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. మరి ఈ స్థాయిలో ఖర్చు చేయిస్తున్న అలియా భట్ తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.