విషాదం.. RRR నటుడు మృతి

ఆర్ఆర్ఆర్ సినిమాలో స్కాట్ పాత్ర లో పవర్ ఫుల్ బ్రిటిష్ ఆఫీసర్ గా నటించిన ఐరిస్ నటుడు రే స్టీఫెన్ సన్ అందరికి గుర్తుండే ఉంటారు. తాజాగా ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా దృవీకరించింది. ఇటలీలోని ఇస్చియా ఐలాండ్ లో క్యాసినో అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణ జరుగుతూ ఉండగా ఆయన సడెన్ గా మిస్టరీ అనారోగ్యానికి గురయ్యారు.

తక్షణమే చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ లో చిత్ర యూనిట్ తరలించింది. కొద్ది రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న అతను మృతి చెందినట్లు ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా ప్రకటించింది. తీవ్రమైన అనారోగ్యం కారణంగానే రే స్టీవెన్ సన్ మే 21న మృతిచెందినట్లు నిర్ధారించింది. అయితే ఆయనకి వచ్చిన అనారోగ్యం ఏంటి అనేది విషయంపై క్లారిటీ లేదు.

ఐర్లాండ్ కి చెందిన రే స్టీవెన్ సన్ బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌ నటనలో శిక్షణ తీసుకొని టెలివిజన్ లో ఎంట్రీ ఇచ్చారు. తరువాత థియరీ ఆఫ్ ఫ్లైట్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. పనిషర్: వార్ జోన్ , ఆక్సిడెంట్ మెన్, హిట్స్ మ్యాన్ హాలిడే లాంటి చిత్రాలలో నటించారు.

అయితే మార్వెల్ సిరీస్ అయిన థోర్ సినిమాలతో స్టీవెన్ సన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆ మూవీ చూసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని స్కాట్ పాత్రకి అతనిని ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రంలో చూపులతోనే క్రూరత్వాన్ని పండించి ప్రశంసలు సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్, తారక్ తర్వాత సినిమాలో అంతటి పవర్ ఫుల్ రోల్ అంటే రే స్టీవెన్ సన్ ది అని చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ మూవీ అతనిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు గుర్తించగలిగారు. ఇదిలా ఉంటే స్టీవెన్ సన్ నటించిన అషోకా వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరో ఇప్పుడు హాలీవుడ్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఇదిలా ఉంటే ఆయన మరణ వార్తపై ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యింది. స్కాట్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. ఇక హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.