22న వస్తోన్న ‘రోటి కపడా రొమాన్స్‌’!

టాలీవుడ్‌ యువ నటులు హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌ నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’ . ఈ సినిమాకు విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ పెయిన్‌ ఆఫ్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’ పేరిట ఫిబ్రవరి 27న స్పెషల్‌ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, వంటి యూత్‌ ఫుల్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన లక్కీ విూడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సృజన్‌ కుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.