ఆర్కె నాయుడు ‘ద 100’

‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు అలరించిన టాలీవుడ్‌ నటుడు ఆర్కే సాగర్‌. ‘సిద్దార్థ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రభాస్‌ ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’, ‘షాదీ ముబారక్‌’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చాలా గ్యాప్‌ తర్వాత ఆర్కే సాగర్‌ నటిస్తున్న తాజా చిత్రం ’ద 100’ .

ఈ సినిమాకు రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ డైరెక్ట్‌ చేసిన ఇండిపెండెంట్‌ ఫిలిమ్స్‌ కు అంతర్జాతీయ అవార్డ్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో ’ద 100’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌ చూస్తుంటే సాగర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాపై దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సాగర్‌ విక్రాంత అనే ఐపిఎస్‌ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపాడు. ఇక ’ద 100’ చిత్రంలో తన పాత్ర కోసం ఆర్కే సాగర్‌ ఫిట్నెస్‌ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్‌ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్‌ పోస్టర్‌ లో పంచింగ్‌ హ్యాండ్‌ ని గమనిస్తే.. ఇది ఒక ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ తో మంచి యాక్షన్‌ ఎంతటైనర్‌ గా రాబోతుందని అర్థమవుతుంది.

విక్రాంత్‌ ఐపిఎస్‌ పాత్రలో ఆర్కే సాగర్‌ ఇంప్రెస్‌ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలాగే కమర్సియల్‌ ఎలిమెంట్స్‌ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ ప్లే తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం నిర్మాతలు తెలిపాడు. ఈ సినిమాకు శ్యామ్‌ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ ఫేమ్‌ హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది.