సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మెయిన్ హీరోయిన్ వరకు ఎదిగింది రీతూ వర్మ. బాద్ షా సినిమాలో కాజల్ చెల్లిగా నటించిన రీతూ వర్మ.. ఏకంగా వెండితెరపై క్రేజీ హీరోయిన్‌గా మారింది. కేవలం తెలుగులోనూ కాకుండా టోటల్ సౌత్ మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కోలీవుడ్ మాలీవుడ్ అని తేడా లేకుండా రీతూ వర్మకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే రీతూ వర్మ ఎంత క్రేజీగా మారిన ఏనాడూ హద్దులు దాటలేదు. తెరపై అందాలన ఆరబోయేలేదు. ఎప్పుడూ పద్దతిగానే కనిపించింది.
పెళ్లి చూపులు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఆపై కొన్ని చిత్రాలు చేసినా అవి అంతగా ఆడలేదు. కానీ రీతూ వర్మ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కనులు కునులను దోచాయంటే అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఒరిజినల్ సినిమా మలయాళంలో మంచి హిట్ అయింది. ఇక కోలీవుడ్‌లోనూ ధృవనక్షత్రం సినిమాతో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.
తాజాగా రీతూ వర్మ సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. హాట్ లుక్కులో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫేస్ మాస్క్‌కు సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. ఇందులో రీతూ వర్మ అందాలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇలా షాకిచ్చావేంటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రీతూ వర్మ టక్ జగదీష్, శర్వానంద్ కొత్త చిత్రంలో, రవితేజ ఖిలాడి చిత్రంలో చాన్స్ కొట్టేసింది.