Ram Gopal Varma : జెర్సీ హిందీ సినిమాపై ఆర్జీవీ కామెంట్స్… రీమేక్ బదులు డబ్బింగ్ వల్ల లాభం వచ్చేది..!

Ram Gopal Varma : వివాదాలలో బ్రతికే జీవి ఆర్జీవీ. వివాదాలు లేకపోతే ఆయనకు రోజు గడవదు ఏదో ఒక విషయంలో మాట్లాడి గెలికేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే విడుదలైన తెలుగు రీమేక్ జెర్సీ సినిమా గురించి కూడా మాట్లాడి మరోసారి వైరల్ అయ్యాడు. ఇక కేజీఎఫ్ 2 ధాటికి జెర్సీ వసూళ్లు పడిపోతున్నాయి. సినిమా బాగున్నా కలెక్షన్స్ రావడంలేదు. ఇక ఈ విషయం పైనే ఆర్జీవీ కుడా స్పందించారు.

నానీ హీరోగా చేసిన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి ఉంటే నిర్మాతలకు 10 లక్షలతో హిందీ వెర్షన్ రెడీ అయ్యేది. కానీ, హిందీలోకి ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. దీనివల్ల నిర్మాతకు 100కోట్ల నష్టం. డబ్బింగ్ తో హిట్ కొట్టొచ్చని బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు నిరూపించాయని చెప్పాడు.కానీ ‘జెర్సీ డెత్ ఆఫ్ రీమేక్స్’ అని హ్యాష్ ట్యాగ్ తో వర్మ పోస్ట్ చేశాడు. మొత్తానికి వర్మ ఈ సారి హిందీ జెర్సీ పై పడటం విశేషం.

ఆర్జీవీ చెప్పిన మాటలో వాస్తవం లేకపోలేదు. నిజానికి తెలుగు జెర్సీ సినిమా బాగా హిట్ అయింది అదే సినిమా ను నిర్మాత హిందీ లోకి డబ్ చేసుంటే సరిపోయేది అలాకాదని రీమేక్ చేయడం వల్ల ఖర్చు పెరిగింది. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ తో హిట్ కొట్టడంతో మరోసారి రీమేక్ ను నమ్ముకున్నాడు షాహిద్ కపూర్. అయితే కేజీఎఫ్ సినిమా ఈసారి ఆశలపై దెబ్బకొట్టింది. నిజానికి సినిమా ఇంకా వారం ముందే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కేజీఎఫ్ ముందు నిలబడదని వాయిదా వేసి మళ్ళీ విడుదల చేసారు. కానీ కేజీఎఫ్ 2 వసూళ్లు ఇంకా కొనసాగుతాయని అంచనా వేయలేక పోయారు. దీంతో జెర్సీ సినిమా బాగున్నా వసూళ్లు రాబట్టడం లేదు.