మహారాష్ట్ర సీఎం కంగనా రనౌత్.. మళ్లీ గెలికిన ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడెలా స్పందిస్తాడో కచ్చితంగా చెప్పలేం. నేడు కంగనా రనౌత్ విషయం ట్రెండింగ్ అవుతుండటంతో తన స్టైల్లో స్పందించాడు. అసలే రియా చక్రవర్తి, అర్నబ్ గోస్వామి, కంగనా రనౌత్, బాలీవుడ్ విషయాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. అర్నబ్ గోస్వామిపై ఏకంగా ప్రాస్టిట్యూట్ అంటూ ఓ సినిమాను కూడా ప్రకటించేశాడు. తాజాగా వర్మ చేసిన ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నేడు ముంబైలో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది. సంజయ్ రౌత్‌కు విసిరిన సవాల్‌లో భాగంగా కంగనా రనౌత్ ముంబైలో అడుగుపెట్టింది. మరో వైపు ముంబై మున్సిపల్అధికారులు కంగనా ఆఫీస్, ఇంటిని కూల్చేశారు. కంగనావి అక్రమ కట్టడాలన్న నెపంతో కక్షగట్టి కూల్చేశారు. దీనిపై కంగనా న్యాయపోరాటం మొదలుపెట్టింది.

RGV Satires On Demolishing Kangana Ranaut Office
RGV Satires On Demolishing Kangana Ranaut Office

ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. నేడు నా ఇంటిని కూలగొట్టారు..రేపు మీ అహంకారం కూలిపోతుంది అని సీఎంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆర్జీవీ స్పందించాడు. చూస్తుంటే మహారాష్ట్ర సీఎం కంగనా రనౌత్ అయ్యేట్టు ఉందని సెటైర్ వేశాడు. అర్నబ్ పీఎం అవుతాడు..శివసేన కనిపించకుండా పోతుంది.. ముంబై పోలీసులు రిపబ్లికన్ టీవీ స్టాఫ్‌తో నింపేస్తారు.. కాంగ్రెస్ ఇటలీకి వెళ్లిపోతుంది.. ఓ మై గాడ్ అంటూ కౌంటర్ వేశాడు.