RGV : ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఆ హీరోయిన్లతో పోలుస్తూ ట్వీట్ చేసిన వర్మ… ప్రచారంలో కొత్త వ్యూహమా…!

RGV: సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయని విధంగా తన సినిమా ప్రమోషన్ల కోసం రామ్ గోపాల్ వర్మ కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ ఉంటాడు.ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన ఈ విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న కలిపి ఒకేతాటి మీదకు తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు.ఇప్పుడేమో ఇలా తన సినిమా ప్రమోషన్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ త్రయాన్ని వాడేస్తున్నాడు.

రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను ఇలా సరికొత్తగా స్టార్ట్ చేసేశాడు వర్మ.

ఇకపోతే ఈ క్రమంలోనే ఆయన ఒక ట్వీట్ చేసాడు..అయితే ఈయన ”వెల్ సార్.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. ఇక నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అని ట్వీట్ చేస్తూ ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది .అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.అంతేకాకుండా ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది.ఇకపోతే అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కొత్తగా ప్రొమోషన్స్ చేస్తూ వర్మ బిజీగా ఉన్నాడు…!!