టాప్ సీక్రెట్ రివీల్.. ఆ సీన్ నుంచే భీమ్ టీజర్ రిలీజ్ చేశారా ..?

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా “రౌద్రం రణం రుధిరం”. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” నుంచి కొమరం భీమ్ టీజర్ రిలీజ్ తాజాగా రిలీజై సంచలనం సృష్తిస్తోంది.

Jr NTR's Komaram Bheem Turns Into a Spiritual Muslim Man From a Fierce  Warrior in Teaser of SS Rajamouli's RRR | India.com

అయితే చరణ్ అల్లూరి టీజర్ వచ్చినప్పటి నుంచి భీమ్ గురించే అందరు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రక రకాల కామెంట్స్ కూడా చేసారు. అవన్నీ వింటూ సైలెంట్ గా ఉన్న దర్శకుడు రాజమౌళి భారీ షాకిచ్చాడు. ఏ ఒక్కరు అస్సలు ఊహించని విధంగా రాజమౌళి తారక్ ను ప్రెజెంట్ చేయడం ఇప్పుడు తారక్ అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. ఇన్నాళ్ల నుంచి వేయి కళ్ళతో ఎదురు చూసినందుకు తగ్గట్టుగా ఈ టీజర్ తో జక్కన అద్భుతాన్ని చూపించాడు. ఈ టీజర్ లో తారక్ పై చూపించిన ప్రతీ షాట్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులందరి రోమాలు నిక్కబొడిచేలా చేసింది.

అయితే ఈ టీజర్ చివరి లో రెండు తాళ్లు పట్టుకుని తారక్ లాగుతూ తన సిక్స్ ప్యాక్ లో ఉన్న ఒక షాట్ ఉంది. ఈ షాట్ లో తారక్ చూస్తే సినిమాలో క్లైమాక్స్ సీన్ మాదిరిగా అనిపిస్తుంది. అందులో నుంచే ఈ టీజర్ కట్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ లో ఒక పోరాట సన్నివేశం పులితో డిజైన్ చేసారని చెప్పుకున్నారు.

ఇప్పుడు అదే సన్నివేశంలోని షాట్ ఇది అని కూడా చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవడానికి కారణం ఈ టీజర్ లో తారక్ కు అయిన గాయాలలో పులి పంజా గుర్తులు కనిపిస్తాయి. ఆ కారణంగానే క్లైమాక్స్ సీన్ సిల్వర్ స్క్రీన్ మీద హై రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా రామరాజు ఫర్ భీమ్ ఊహించని రీతిలో అదిరిపోయింది.