రేణు దేశాయ్ అంటే.. ఒకప్పటి హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె ఐడెంటిటీలో ఇప్పటికీ ‘పవన్ కళ్యాణ్ మాజీ భర్త’ అనే కనిపిస్తోంది.! మీడియా ఆమెను అలాగే పేర్కొంటోంది మరి.!
ఈ గుర్తింపుని రేణు దేశాయ్ మాత్రం ఎలా వదులుకుంటారు.? ‘నో కామెంట్’ అనేయాల్సిన ప్రశ్నలకు సవివరంగా సమాధానమిస్తూ, పాత పాటే పాడుతుంటారు రేణు దేశాయ్.
‘గతంలో చెప్పిందీ నిజమే.. ఆ తర్వాత చెప్పిందీ నిజమే..’ అంటూ పవన్ కళ్యాణ్‌తో విడాకులు, అలాగే పవన్ కళ్యాణ్ మంచితనం గురించి రేణు దేశాయ్ చెబుతుండడం కొన్ని మీడియా సంస్థలకు అయిష్టంగానే ఇష్టమవుతోంది.
‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రమోషన్లలో రేణు దేశాయ్ నోట వీలైనంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ పేరు వచ్చేలా మీడియా ప్రయత్నించిందా.? ఆమె స్వయంగా స్పేస్ తీసుకున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
ఇంత చేసినా, సినిమా తుస్సుమనడం.. అందులో రేణు దేశాయ్ పాత్ర నిడివి, ఆ పాత్ర ప్రాధాన్యత చాలా తక్కువవడంతో.. రేణు దేశాయ్ రీ-ఎంట్రీ కాస్తా డిజాస్టర్ అయి కూర్చుంది. అయితే, ఆమె నోట వచ్చిన పవన్నామ జపం అయితే మాత్రం, హిట్టయ్యిందనే చెప్పొచ్చు.