రేణూ దేశాయ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణిగా రేణూ దేశాయ్‌కి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వుంది. గతంలో హీరోయిన్‌గా పవన్ కళ్యాణ్‌తోనే సినిమాలు చేసిన అనుభవం వుంది రేణూ దేశాయ్‌కి.
అయితే పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్నాకా నటనకు దూరమైంది. అంతకు ముందే టెక్నికల్ ఫీల్డ్‌లో రేణూ దేశాయ్‌కి మంచి అనుభవం వుంది. తెర వెనక వివిధ విభాగాల్లో ఆమెకు ప్రావీణ్యం వుంది.
దర్శకురాలిగా, నిర్మాతగా గతంలో రేణే దేశాయ్ పలు చిత్రాలు చేశారు. అయితే తెలుగులో చేయలేదు. వేరే వేరే భాషల్లో చేశారు. ఇప్పుడు తెలుగులో నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నారట.
ముద్దుల తనయ ఆధ్య పేరుతో ఓ బ్యానర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. కుర్ర హీరో అడవి శేష్ ఈ బ్యానర్‌కి సపోర్టివ్‌గా వుండబోతున్నాడనీ సమాచారం.
అడవి శేష్, రేణూ దేశాయ్‌కి మంచి స్నేహితుడు. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా పలు సందర్భాల్లో రేణూ దేశాయ్‌తోనూ, అకీరా నందన్‌తోనూ కలుస్తుంటాడు. అడవి శేష్ కేవలం హీరో మాత్రమే కాదు, ఆయన కూడా మల్టీ టాలెంటెడే. స్ర్కిప్ట్ రైటింగ్స్, డైరెక్షన్ అనుభవం, నిర్మాణ పరమైన మెలకువలు తదితర టెక్నికల్ ఇష్యూస్‌లో ధిట్ట.
సో, అలా అడవి శేష్‌తో కలిసి రేణూ దేశాయ్ ఈ నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసి ముందుకు నడిపించాలనుకుంటోందట చూడాలి మరి.