పాన్ ఇండియన్ సినిమాతో రేణు దేశాయ్ సాలీడ్ ఎంట్రీ.. టైటిల్ తోనే బిజినెస్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది రేణు దేశాయ్. పూరి జగన్నాధ్ డెబ్యూ సినిమాగా వచ్చిన బద్రి సెన్షేషనల్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత రేణు దేశాయ్ మాత్రం ఎక్కువగా సినిమాలు చేయలేదు. మరోసారి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తూ నటించిన జానీ సినిమాలో పవన్ కి జంటగా నటించింది. పవన్ తో కొంతకాలం వైవాహిక జీవితం కొనసాగించిన రేణు దేశాయ్ ఆ తర్వాత ఇద్దరి పరస్పర అంగీకరంతో విడాకులు తీసుకున్నారు.

అయితే పవన్ కళాణ్ పెళ్ళి చేసుకున్నాక రేణు దేశాయ్ ఇద్దరి పిల్లకి తల్లైంది. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య. కాగా గత కొంతకాలంగా మెగా వారసుడిగా అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడని వార్తలు వచ్చాయి. కాని అందుకు ఇంకా సమయం ఉందని తెలుస్తుంది. అయితే మెగా ఫ్యాలీలో వరుణ్ తేజ్ తర్వాత అంత హైట్ ఉన్న కుర్రాడిగా అకీరా ఇప్పటికే ప్రేక్షకుల దృష్ఠిని ఆకర్షించాడు. ఫ్యాన్స్ కూడా అకీరా హీరో ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్ కూడా సినిమాలలో నటించేందుకు ఆసక్తిగా ఉందని ఈ కారణంగానే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ జంటగా నటిస్తున్నారు.

దర్శకుడిగా ఎం.ఆర్.కృష్ణ మామిడాల పరిచయమవుతుండగా డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతేకాదు రేణు దేశాయ్ గారాల పట్టు ఆద్య పేరు నే ఈ సినిమా టైటిల్ గా ప్రకటించబోతున్నారట. ఇందుకు విజయ దశమి పండుగ రోజు న ముహూర్తం కుదిర్చినట్టు తాజా సమాచారం. కాగా ఆద్య అన్న టైటిల్ కే ఇప్పుడు సినిమా మీద భారీగా క్రేజ్ నెలకొందని అంటున్నారు. ఇక ఈ టైటిల్ తో సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరగనుందని సమాచారం.