ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌కు షాక్.. పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన రేణూ దేశాయ్!!

Renu Desai shares Pawan Kalyan adorable pic with his children

రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని విడిపోయాక.. అభిమానులు ఎంతగా హర్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తన స్వంత నిర్ణయంతోనే విడాకులు తీసుకున్నాడు. రేణూ దేశాయ్ అందుకు అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే అన్నాలెజినోవాతో అంతకు ముందు నుంచే ప్రేమాయణాన్ని కొనసాగించాడు. సంతానాన్ని కన్నాడు. ఈ విషయంలో రేణూ దేశాయ్ బాగానే హర్ట్ అయినట్టు తరువాత ఇంటర్వ్యూలో చెప్పింది.

Renu Desai shares Pawan Kalyan adorable pic with his children
Renu Desai shares Pawan Kalyan adorable pic with his children

కానీ ఏనాడూ కూడా పవన్ కళ్యాణ్‌ను పల్లెత్తు మాట అనలేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తరువాత కూడా మంచిగానే చెప్పంది. కానీ ఫ్యాన్స్ మాత్రం రేణూ దేశాయ్‌ను వదిన అని పిలుస్తూ ఉండటంతో ఫీలైంది. పవన్ కళ్యాణ్‌ను అన్నగా.. తనను వదినగా పిలవొద్దని అభిమానులకు సూచించింది. ఇక రేణూ దేశాయ్ రెండో పెళ్లి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా అభ్యంతరాలు పెట్టారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసుకున్నప్పుడు ఎందుకు అడగలేదు.. తాను చేసుకుంటున్నప్పుడు ఎందుకు అడుగుతున్నారని రేణూ దేశాయ్ ఫైర్ అయింది.

అయితే పవన్ కళ్యాణ్‌తో రేణూ దేశాయ్ ఇంకా సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తన పిల్లలకు తండ్రి అనే బంధం కావాలి. అందుకే మెగా ఇంట్లో పండుగల సమయంలో పిల్లలను పంపింస్తోంది. ఆ మధ్య కరోనా సమయంలోనూ తన పిల్లలను పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించినట్టు రేణూ దేశాయ్ తెలిపింది. తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ఓళ్లో తన పిల్లలిద్దరూ పడుకున్నారు. ఆ ఫోటోను రేణూదేశాయ్ షేర్ చేస్తూ.. కొన్ని అద్భుతమైన ఫోటోలు కచ్చితంగా షేర్ చేయాలి.. అలాంటి ఫోటోలు మన ఫోన్‌లో ఊరికే ఉంచకూడదు.. నా ఫోన్‌లోని కెమెరాతో నేను బంధించిన కొన్ని అపురూపమైన చిత్రాల్లో ఇదొకటి అని అందరికీ షాక్ ఇచ్చింది.